*అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి*
*సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్*
సమస్టే భారత్ షాద్ నగర్,ఆగస్ట్31: షాద్ నగర్ అర్హులైన పేదలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు, అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టా సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో సిపిఎం పార్టీ షాద్నగర్ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి పలు సమస్యలను
ఫరూక్నగర్ మండల పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ రెవెన్యూ అధికారులను కలిసి విన్నవించారు షాద్నగర్ మున్సిపల్ ఫరూక్నగర్ మండల పరిధిలో అనేకమంది పేద, నిరుపేద కుటుంబాలు సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి, వారికి ఇళ్లను మంజూరు చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
అదేవిధంగా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హత పొందిన లబ్ధిదారులకు ఇప్పటివరకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని . అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పట్టా సర్టిఫికెట్లను ఎలాంటి రాజకీయ జాప్యం లేకుండా వెంటనే అందజేయాలని కోరుతున్నాము
డిమాండ్లు:
1 అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను రెండో విడతలో మంజూరు చేయాలి.
2 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలి.
3 అర్హులైన పేదలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా న్యాయం చేయాలి.
4 ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా 14 రకాల రేషన్ సరుకులను అర్హులైన ప్రతి కుటుంబానికి క్రమం తప్పకుండా పంపిణీ చేయాలి
5 అర్హత కలిగిన వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లను వెంటనే మంజూరు చేసి, అందజేయాలి.
6. డబుల్ బెడ్ ఇండ్లలో మంచినీటి సమస్యను పరిష్కరించారు అదేవిధంగా అక్కడ చెత్త దుర్వాసన తొలగించాలి
7. 7. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు
8. 8. ప్రభుత్వ హాస్టళ్లకు సొంత హాస్టలను నిర్మాణం చేపట్టాలన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు లక్ష్మి అంజమ్మ పార్వతమ్మ షకీలా బేగం బాలరాజు సి రాజు తదితరులు పాల్గొన్నారు.



