ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeతెలంగాణమరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు – 12వ వార్డులో డ్రైనేజీ పనుల పరిశీలన

మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు – 12వ వార్డులో డ్రైనేజీ పనుల పరిశీలన

📰 Generate e-Paper Clip

మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు – 12వ వార్డులో డ్రైనేజీ పనుల పరిశీలన

 

నమస్తే భారత్ :-మరిపెడ

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 12వ వార్డు పరిధిలో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు.

పట్టణంలో పారిశుధ్య నిర్వహణను.మెరుగుపరచడంతో పాటు వర్షాకాలంలో మురుగునీరు, వర్షపు నీరు నిల్వ కాకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.

అలాగే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన చోట్ల డ్రైనేజీ పనులను చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీ కృషి చేస్తుందని చైర్‌పర్సన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ గంట్ల గౌతమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి భిక్షపతి, వంగవీటి భరత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!