ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeతెలంగాణజామియా మస్జీద్ లో అసారే ముబారక్ కార్యక్రమం

జామియా మస్జీద్ లో అసారే ముబారక్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

జామియా మస్జీద్ లో అసారే ముబారక్ కార్యక్రమం

నమస్తే భారత్ షాద్ నగర్,ఆగస్ట్ 28: మొహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ ఫరూక్ నగర్ లోని జామే మస్జీదులు ఇమామ్ సయ్యద్ షాబుద్దీన్, సయ్యద్ అజరుద్దీన్ హఫెజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ఆసారే ముబారక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముస్లిం మత పెద్దలు రిజ్వాన్ పాషా ఖాద్రి హాఫెజ్, ఖాజీ సయ్యద్ ముక్తాదిర్ అలీ, మునవర్ అలీ హాఫేస్, ఏతేశం హాఫిజ్, సయ్యద్ నదీమ్ హాఫెజ్, షోయబ్ అత్తరి హాఫిజ్,సిరాజ్ హాఫిజ్, మస్జిద్ కమిటీ అధ్యక్షుడు యూసుఫ్, యాకూబ్,లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజ్వాన్ పాషా ఖాద్రి మాట్లాడుతూ.మహమ్మద్ ప్రవక్త స్తుతించిన పవిత్ర జలం త్రాగితే అన్ని రోగాలు సయమవుతాయని అన్నారు. శాంతి సహనానికి సఖ్యతకు, మహమ్మద్ ప్రవక్త బోధనలు చిహ్నం అని అన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త వెంట్రుకలను ప్రదర్శించారు. వీటిని తిలకించేందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, యువకులు, పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. జామియా మస్జీద్ లో అసారే ముబారక్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఫోటో దృశ్యం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!