ePaper
Thursday, August 27, 2026
ePaper
Homeఎడిటోరియల్రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన

రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన

📰 Generate e-Paper Clip

రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన

 

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య

 

నమస్తే భారత్ :-తొర్రూరు

 

రోస్టర్‌ విధానంలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుం దని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య పేర్కొన్నారు.బుధవారం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతిభవనంలో మాల మహానాడు జిల్లా ఇన్చార్జి యం ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన మాల మహానాడు జిల్లా ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకణ రోస్టర్‌ జీవో 99 వల్ల మాల సామాజిక వర్గం నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రూప్ 3 లోని మాల, అనుబంధ కులాలకు కొన్ని నోటిఫికేషన్లలో సున్నా పోస్టులు, మరికొన్ని నోటిఫికేషన్ల లో 2 శాతం లోపు ఉద్యోగాలను కేటాయించడం అన్యాయమన్నారు. రోస్టర్ విధానంలో ఉన్న లోపాల గురించి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాత్రమే మాట్లాడుతున్నారని, మిగతా ఎమ్మెల్యేలు, ఎం ఎల్ సి లు,ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. సబ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం రోస్టర్ ను తక్షణం సవరించాలని డిమాండ్ చేశారు.మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి చెమట చిందించిన మాలలకు న్యాయం జరగడం లేదన్నారు. రోస్టర్ పాయింట్ల సవరణ కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తూ విద్యార్ది యువకులను చైతన్య పరుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు.

 

జిల్లా నూతన కమిటీ ఎన్నిక.

 

అధ్యక్షులుగా ఎనమాల రాకేష్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా గుండాల బిక్షం, డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షులు గా కొప్పుల శ్రీనివాస్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోగా చెన్నయ్య నియామక పత్రాలు అందజేశారు.ఈ సమావేశం లో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దాసరి ప్రకాష్ , గుర్రాల లింగన్న , ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పంజా కల్పన, సీనియర్ నాయకులు పప్పుల వెంకన్న, ప్రేమ్, గుండాల బిక్షం, కొప్పుల శ్రీనివాస్, గొడిశాల సంజీవరావు, సోషల్ మీడియా కన్వీనర్ జి రమేష్,ఉద్యోగ సంఘాల నాయకులు సుధాకర్ రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!