ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeఎడిటోరియల్స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన...

స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం

📰 Generate e-Paper Clip

స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక

మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం

నమస్తే భారత్ :-మరిపెడ

ఇటీవల వరంగల్ వేదికగా జరిగిన అండర్-14 జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ గా అద్భుత ప్రతిభ కనబరిచిన మేరుగు జశ్వంత్, తెలంగాణ స్టేట్ అండర్-14 జట్టుకు ఎంపికయ్యాడు. అతని ఆటతీరును గుర్తించిన సెలెక్టర్లు తెలంగాణ స్టేట్ అండర్-14 జట్టులో స్థానం కల్పిస్తూ సోమవారం జట్టును ప్రకటించారు. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చంపా జిల్లాలో జరగనున్న అండర్-14 క్రికెట్ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు తరఫున జశ్వంత్ పాల్గొననున్నాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన మెరుగు జశ్వంత్ స్థానిక సెయింట్ అగస్టీన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఆసక్తి కలిగిన జశ్వంత్ స్టేట్ టీంకు ఎంపీక అవటంతో తల్లి దండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!