ePaper
Monday, September 21, 2026
ePaper
Homeఎడిటోరియల్సిద్ధాపూర్ డంపింగ్ యార్డు రద్దు కోసం చట్టసభల్లో ప్రజల పక్షావ పోరాటం చేయాలని స్థానిక సంస్థల...

సిద్ధాపూర్ డంపింగ్ యార్డు రద్దు కోసం చట్టసభల్లో ప్రజల పక్షావ పోరాటం చేయాలని స్థానిక సంస్థల శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ కు

📰 Generate e-Paper Clip

*సిద్ధాపూర్ డంపింగ్ యార్డు రద్దు కోసం చట్టసభల్లో ప్రజల పక్షావ పోరాటం చేయాలని స్థానిక సంస్థల శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ కు సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ వినతి పత్రం*

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్22:రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ను ఏర్పాటు చేయడం కోసం 86 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ కి బదలాయిస్తూ జీవో ఆర్టీ నెంబర్ 641ని తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ ను కలసి ఈ జీవో రద్దు కోసం చట్టసభల్లో ప్రజల పక్షావ పోరాటం చేయాలని సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వినతి పత్రం అడజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ…ఈ డంపింగ్ యార్డు ఏర్పాటు వలన విపరీతమైన దుర్వాసనతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, ఆర్ధిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాలు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. చెత్తనుండి విడుదలయ్యే విషపూరిత ద్రవం (లీచెట్) భూమిలోని భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. చెత్త కుళ్ళడం వల్ల మీథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజెన్ సల్ఫేట్ లాంటి వాయువులు విడుదల అవుతాయి. ఈ వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ సమస్యలు అస్తమా, అలర్జీలు, చర్మ వ్యాధులు సంభవిస్తాయి. వాతావరణంలో మార్పులకు దోహదం చేస్తాయి. మిథిన్ వాయువు వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంది అన్నారు.
అంతే కాకుండా ఈ కలుషిత నీరు ఈ ప్రాంతంలో ఉండే గొలుసుకట్టు చెరువుల గుండా హైదరాబాద్ కు తాగు నీరు అందించే హిమాయత్ సాగర్ లో కలుస్తుంది. అక్కడి ప్రజలు కోడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్క మూసి సుందరీకరణ పేరుతో కాలుష్యాన్ని తగిస్తాం అంటూనే మళ్ళా ఈ కాలుష్య నీటిని మూసిలోకే వదలటం అంటే సుందరీకరణకు అర్థం లేకుండా పోతుంది. విమానాశ్రయం దగ్గర ఉండటం వల్ల ఈ డంప్ యార్డు కు వచ్చే పక్షుల తో విమానాలకు ప్రమాదాలు జరిగే ఆస్కారం లేకపోలేదు.. ఈ ప్రతిపాదిత డంప్ యార్డు ప్రాంతంలో భూగర్భ గ్యాస్ లైన్ కోడా ఉండటం భారీ ప్రమాదాలకు నిలయంగా కోడా మారవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పడిపోయే అవకాశం ఉంది. భవిషత్ తరాలకు స్వచ్చమైన గాలి, నీరు , ఆహారం లభించటం కష్టమవుతుంది అని తెలిపారు.సిద్దాపూర్ తో పాటు సుమారు 50 గ్రామాల ప్రజల జీవన విధానం పై ప్రభావం చూపుతుందని, ఇప్పటికే మీరు రద్దు కోసం కృషి చేస్తున్నట్లు చూస్తున్నామని, ఈ డంపు యార్డు ను రద్దు చేయాలని, జీవో ఆర్టీ నెంబర్ 641 ను వెనక్కి తీసుకునేలా మీ ప్రభుత్వం పై ప్రజల తరుపున చట్ట సభల్లో పోరాటం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ, నా వంతు కృషి చేస్తున్నట్లు మీరు గుర్తించారు కదా, తప్పకుండా డంపింగ్ యార్డు రద్దు కోసం చట్ట సభలో పోరాటం చేస్తా! నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూడావత్ రాంబాల్ నాయక్, కన్వీనర్ పినపాక ప్రభాకర్,, కో చైర్మన్లు బొజ్జ శ్రీనివాస్ రెడ్డి, వడ్డే బాలయ్య, ఈశ్వర్ నాయక్, భూక్యా రజిత కో కన్వీనర్లు రవీంద్రనాథ్,, శ్రీకాంత్, పవన్ చౌహాన్, మహేష్, సలహాదారులు అబ్దుల్ రబ్ జామి, నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!