ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeఎడిటోరియల్కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ.ఆపదలో ఆదుకుంటూ.ప్రజా సేవలో ముందుండే నాయకుడు

కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ.ఆపదలో ఆదుకుంటూ.ప్రజా సేవలో ముందుండే నాయకుడు

📰 Generate e-Paper Clip

కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ.ఆపదలో ఆదుకుంటూ.ప్రజా సేవలో ముందుండే నాయకుడు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్

పాస్టర్ జీవన్, ఎన్టీఆర్ నగర్ ప్రజలు

నమస్తే భారత్ :-కేసముద్రం

ప్రజల కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సోమారపు సామెల్ మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ పరామర్శించారు.మృతుడి భార్య ముత్తమ్మ, కుమారుడు యాకుబ్‌ను పరామర్శించి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం 50 కిలోల బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.
మండల అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ.. పేదలు, నిరుపేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ముందుండి సహాయం చేయడం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా సమ్మిగౌడ్ ఫౌండేషన్ స్థాపకుడిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు.కొనసాగిస్తామని అన్నారు.కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచిన సమ్మయ్య గౌడ్‌ను పాస్టర్ జీవన్‌తో పాటు ఎన్టీఆర్ నగర్ ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ వల్లందాస్ ఉమా రవి, కాంగ్రెస్ నాయకులు చిట్ల సంపత్, కీర్తి సురేందర్, మాసాడి శ్రీనివాస్, అజ్మీర రమేష్, పోలపల్లి వెంకటరెడ్డి, కత్తెరశాల శ్రీనివాస్, ఎన్నమాల మహేందర్, పాస్టర్ జీవన్, రమేష్ నాయక్, సోష్కండ్ల సుభాష్ రెడ్డి, సంకపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!