రహదారి ఆక్రమణలపై ఉక్కుపాదం
గాజులరామారం సర్కిల్లో అధికారుల ప్రత్యేక డ్రైవ్


➤ ఉష ముళ్ళపూడి హాస్పిటల్ నుంచి చంద్రగిరి నగర్ చౌరస్తా వరకు ఆక్రమణల తొలగింపు
➤ వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు
➤ అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక
➤ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాలతో దూకుడు
➤ రహదారులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదన్న గాజులరామారం ఉప కమిషనర్
➤ ప్రత్యేక డ్రైవ్‌ను పర్యవేక్షించిన టౌన్ ప్లానింగ్ అధికారులు
గాజులరామారం, ఆగస్టు 14 (నమస్తే భారత్): సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజులరామారం సర్కిల్ పరిధిలో రహదారి ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఉష ముళ్ళపూడి హాస్పిటల్ నుంచి చంద్రగిరి నగర్ చౌరస్తా వరకు రహదారిపై ఏర్పడిన ఆక్రమణలను అధికారులు తొలగించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారి పరిధిలో ఆక్రమణలకు పాల్పడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని గాజులరామారం ఉప కమిషనర్ యు. వెంకట్ రాములు హెచ్చరించారు. అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు చేపడితే వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులను ఆక్రమించుకోవడాన్ని ఉపేక్షించబోమని తెలిపారు. ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆర్. సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ బి. సరిత సేన్ తమ సిబ్బందితో కలిసి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రహదారులపై ఆక్రమణలు చేసి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.



