ఎస్ ఆర్ ఒకేషనల్ కళాశాలలో ఘనంగా తీజ్ వేడుకలు
తీజ్ ఉత్సవాలను ప్రారంభించిన ఎసిపి రవీందర్ రెడ్డి
నర్సంపేట ఆగష్టు13(నమస్తే భారత్) :
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎస్సార్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హజరైన నర్సంపేట ఎ సి పి రవీందర్ రెడ్డి లంబాడీ బంజారా సమాజ ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి, పూజలు చేసి తీజ్ వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగాఎ సి పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ
ఎస్సార్ ఒకేషనల్ కళాశాలలో విద్యార్థుల చదువుతో పాటు అన్ని వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం కల్పిస్తూ ఇలాంటి పండుగలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు . తీజ్ పండుగ విద్యార్థుల్లో ఐక్యత, సోదరభావం, క్రమశిక్షణ, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది అని అన్నారు.విద్యతో పాటు మన సంస్కృతి, విలువలను కాపాడుకోవడం కూడా మన బాధ్యత అని తెలిపారు. తీజ్ వేడుకల సందర్భంగా కళాశాల ప్రాంగణం బంజారా సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా సందడిగా మారిందన్నారు .
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కొయ్యడి సనత్ కుమార్ మాట్లాడుతూ తీజ్ పండుగ బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే గొప్ప పండుగ అని తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో గోధుమ మొలకలను పెంచుతూ, ప్రకృతి పట్ల కృతజ్ఞతను, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను, సమాజ ఐక్యతను చాటుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు.ముఖ్యంగా యువత మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకొని వాటిని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.కళాశాల విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని తీజ్ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రైస్ మిల్ అసోసియేషన్
సెక్రటరీ సింగర్ కొండ మాధవ శంకర్ ,
అమ్మ హాస్పిటల్ డాక్టర్ హిమబిందు, డాక్టర్ విశ్వనాధ్ నాయక్,
ఎస్సార్ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ కొయ్యడి శిరీష కళాశాల డైరెక్టర్ కొయ్యడి సరళ , వైస్ ప్రిన్సిపాల్ సూరయ్య, రమేష్ నాయక్, వెంకన్న,సంతోష్, సందీప్, కుమార్ హరి భూషణ్ నజిమ, లంబాడి హక్కుల పోరాట సమితి స్టేట్ జెనరల్ సెక్రటరీ వాసు నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జగన్, టీ ఎన్ ఎస్ ఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సుభాష్ సేవలాల్ సేన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



