మోత్కూలగూడలో వైభవంగా మైసమ్మ–పోచమ్మ తల్లి బోనాల వేడుకలు
గ్రామంలో ఆధ్యాత్మిక శోభ.. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జెట్ట రాజు
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్04:షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం మోత్కూలగూడ గ్రామంలో మైసమ్మ, పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్ట రాజు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ బోనాల ఊరేగింపులతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గ్రామానికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్ట మహేందర్, సీనియర్ నాయకులు కుమార్,గ్రామ 04 కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు జెట్ట నరేష్,మండలం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ హరీష్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామస్వామి, కోశాధికారి మహేష్ , రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.



