ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeఎడిటోరియల్పెద్ధి అంతిమయాత్రకు పోటెత్తిన జనం

పెద్ధి అంతిమయాత్రకు పోటెత్తిన జనం

📰 Generate e-Paper Clip

పెద్ధి అంతిమయాత్రకు పోటెత్తిన జనం

పెద్దికి కన్నీటి నివాళులు

శోక సముద్రంలో నర్సంపేట

నర్సంపేట జూన్ 31(నమస్తే భారత్ ) :

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ ఎస్ సినియర్ నాయకుడు ,తెలంగాణ ఉద్యమకారుడు పెద్ధి సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది గా ప్రజలు నర్సంపేట కు తరలివచ్చారు. అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణ మంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమా రు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించ గా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట కు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి.
చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకు డికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు. అంతేగాక రాజకీయాలకతీతంగా పలువురు నాయకులు పెద్ధికి శ్రద్థాంజలీ ఘటించారు.అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు నెమ్మది గా కదలడంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు.పెద్ధిని కడసారి చూడడంకోసం వరంగల్ ,మచ్ఛాపూర్ ,కొమ్మాల, గిర్నిబావి, లక్నెపల్లి ,మహేశ్వరం ,నర్సంపేట ,మల్లంపల్లి రోడ్ నుంచి నల్లబెల్లి వరకు జనాలు బారులు తీరారు. దారి పోడవున ప్రజలు కన్నీటీ నీరజనాలు పలికారు.
వృధా కాదు నీత్యాగం వృధాకాదు నీ మరణం జనం గుండెల్లో చెదరని ముద్ర వేశావు.సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమానికే ఉనికి చాటావు.ఎన్నో ఒడి దోడుకుల మధ్య సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే గా గెలిచి నర్సంపేటకు గోదావరి జలాలు మల్లించావు. నా నియోజక వర్గ ప్రజలు అనారోగ్యం బారినపడకుండా నర్సంపేటకు వైద్య కళాశాల తెచ్చిన ఘనత మరువ లేరు ఇక్కడి ప్రజలు.ఏ శకునం ఎట్లచ్చిందో నీ కన్నతల్లి కడుపు కాల్చేసింది.మాకు మనో దైర్యం లేకుండా చేసింది. మరువలేని నీ మరణం, నీ త్యాగం.తల్లడిల్లుతున్న నీ జనానికి కాలం ఎం చెప్పుతుందో చూడాలి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!