ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeఎడిటోరియల్అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. చైన్ స్నాచింగ్ నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. చైన్ స్నాచింగ్ నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు.

📰 Generate e-Paper Clip

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.

చైన్ స్నాచింగ్ నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు.

ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి.

బంగారం, బైకు, మొబైల్స్, రెండు కత్తులు స్వాదినం.

మీడియా సమావేశంలో పాల్గొన్న డిసిపి శిరీష,ఏసీపీ లక్ష్మీనారాయణ.

నమస్తే భారత్ షాద్ నగర్ 29:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డీసీపీ కార్యాలయంలో పోలీసులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం లో పాల్గొన్న ప్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి,కేసు వివరాలు వెల్లడించారు.సీపీ తెలిపిన వివరాల ప్రకారం….. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల సంతాపూర్ పరిధిలో, కడ్తల్ వద్ద రెండు చోట్ల ఈ నెల 24 వ తేదీ నాడు ఇద్దరు మహిళల మేడలో నుండి బంగారు చైన్లు లాక్కెళ్లినట్లు పిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారని, సాంకేతిక పరిజ్ఞానం తో కేసును దర్యాప్తు చేసి దుండగులను ఈ రోజు కేశంపేట వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులు రాజస్థాన్ నుండి షాద్ నగర్ పరిధిలో వరి కోతల సమయం లో వరి కోత మిషన్ పని మీద తరచూ ఇక్కడకి వస్తారని, వెళ్లే ముందు ఇక్కడ దొంగతనాలు చేసి వెళ్ళిపోతారని తెలిపారు. నిందితులు వాడిన బైక్ మహబూబ్ నగర్ వద్ద దొంగించారని, మొబైల్ ఫోన్లు రైలు లో దొంగిలించారని తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేయగా మరొకరు పరారిలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుండి 8 తులాల బంగారం, ఒక బైకు ఐదు మొబైల్ ఫోన్లు, రెండు కత్తులు సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు. నేరాల అదుపు కు ప్రజల సహకారం పోలీసులకు కావాలన్నారు.ఈ మీడియా సమావేశంలో డిసిపి శిరీష, ఏసిపి లక్ష్మీనారాయణ, సిఐలు శ్రీనివాస్, నరహరి, ఎస్సై తదితర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!