ePaper
Sunday, July 26, 2026
ePaper
Homeఎడిటోరియల్నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సరిపోదు

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సరిపోదు

📰 Generate e-Paper Clip

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సరిపోదు

సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ డిమాండ్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండల కేంద్రంలోని రాజీవ్ సెంటర్‌లో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఒక్కటే పరిష్కారం కాదని, ఈ కుంభకోణంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ అన్నారు.మరిపెడ బంగ్లా మండల కేంద్రంలోని రాజీవ్ సెంటర్‌లో మాట్లాడుతూ, నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను కట్టుదిట్టం చేయాలని, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!