ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఎడిటోరియల్నీట్ పేపర్ లీకేజీపై కేసముద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా ప్రశ్నించే గొంతులను తాళం...

నీట్ పేపర్ లీకేజీపై కేసముద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా ప్రశ్నించే గొంతులను తాళం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం – ఎమ్మెల్యే డా. మురళీ నాయక్

📰 Generate e-Paper Clip

నీట్ పేపర్ లీకేజీపై కేసముద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా

ప్రశ్నించే గొంతులను తాళం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం – ఎమ్మెల్యే డా. మురళీ నాయక్

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు – కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి

నమస్తే భారత్ :-కేసముద్రం

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నీట్ పేపర్ లీకేజీ ఘటనకు, ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానుకోట ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ మాట్లాడుతూ.దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తీవ్రంగా విమర్శించారు. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో వరుసగా జరుగుతున్న అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల.భవిష్యత్తును ప్రశ్నార్థకంగా.మారుస్తున్నాయని అన్నారు. పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతులను తాళం వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర.ప్రభావం.చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థుల శ్రమ ఒక్క ఘటనతో వృథా కావడం బాధాకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు విద్యార్థుల్లో పరీక్షలపై నమ్మకాన్ని దెబ్బతీసి, వారి ఉన్నత విద్య లక్ష్యాలను ఆందోళనకరంగా మారుస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. *ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని.పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!