ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఎడిటోరియల్ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం ప్రారంభం సర్పంచ్ దాసరి రమేష్

ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం ప్రారంభం సర్పంచ్ దాసరి రమేష్

📰 Generate e-Paper Clip

ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం ప్రారంభం

సర్పంచ్ దాసరి రమేష్

ఖానాపురం జూలై22 (నమస్తే భారత్ ) :
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో “ఇంటికి ఐదు మొక్కలు” పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ దాసరి రమేష్ ప్రారంభించారు.ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ
గ్రామంలోని ప్రతి ఇంటికి 5 మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నాం. ఇందులో పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు,పూల మొక్కలు ఉన్నాయి. హరితహారం లక్ష్యాలకు అనుగుణంగా మన గ్రామాన్ని పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా మొక్కల పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రతి కుటుంబం తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,సభ్యులు గుండ్లపల్లి మంజుల ఫీల్డ్ అసిస్టెంట్ యాకయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!