ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్జీడిమెట్ల నూతన సీఐ రవికుమార్‌కు యూఎస్ఎఫ్ఐ నేతల శుభాకాంక్షలు

జీడిమెట్ల నూతన సీఐ రవికుమార్‌కు యూఎస్ఎఫ్ఐ నేతల శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

  1. జీడిమెట్ల నూతన సీఐ రవికుమార్‌కు యూఎస్ఎఫ్ఐ నేతల శుభాకాంక్షలు

-బాధ్యతలు స్వీకరించిన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రతినిధులు

-శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేత

-శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థ సేవలు అందించాలని ఆకాంక్ష

-యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి

:-ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని సీఐ రవికుమార్ స్పష్టం

-సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని ప్రజలకు సూచన

కుత్బుల్లాపూర్, జూలై 20 ( నమస్తే భరత్ ): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్‌ను యూఎస్ఎఫ్ఐ (USFI) మేడ్చల్ జిల్లా కమిటీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్, ఖుషి ధర్మ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో సీఐ రవికుమార్ సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం అందించాలని కోరారు. దీనికి స్పందించిన సీఐ రవికుమార్ మాట్లాడుతూ, ప్రజాసేవే తన ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, ఎవరికైనా సమస్యలు ఉంటే ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!