ePaper
Monday, June 15, 2026
ePaper
Homeఎడిటోరియల్దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పేరేడ్ కార్యక్రమం

దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పేరేడ్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పేరేడ్ కార్యక్రమం

-రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఆకట్టుకున్న వేడుక

-బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ జీ, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరు

-మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, నేతలతో కలిసి పాల్గొన్న రావుల శేషగిరి

-జాతీయ భద్రత, దేశభక్తి స్ఫూర్తిని చాటిన కార్యక్రమం

కుత్బుల్లాపూర్, జూన్ 13 (విజన్ ఆంధ్ర ):దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా నిర్వహించిన పేరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ జి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రవు , మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్, గాజులరామారం మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి ప్రముఖ నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ రక్షణలో సాయుధ దళాల సేవలను కొనియాడుతూ నిర్వహించిన ఈ పేరేడ్ కార్యక్రమం దేశభక్తి భావాలను మరింత పెంపొందించేలా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు భారత సాయుధ దళాల క్రమశిక్షణ, సేవా తత్వం, దేశ భద్రత పట్ల వారి అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!