ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎన్నికలప్పుడే నాకు రాజకీయాలు : పినపాక ఎమ్మెల్యే పాయం

ఎన్నికలప్పుడే నాకు రాజకీయాలు : పినపాక ఎమ్మెల్యే పాయం

📰 Generate e-Paper Clip

ఎన్నికలప్పుడే నాకు రాజకీయాలు : పినపాక ఎమ్మెల్యే పాయం

ప్రభుత్వ సంక్షేమ పధకాల పంపిణీలో అన్ని పార్టీలు సమానమే..

అర్హులు అయితే చాలు అభివృద్ధి సంక్షేమమే నాకు ఎజెండా…

– చింతల బయ్యారం లో పుష్కర ఘాట్ ఏర్పాట్లు.

నమస్తే భారత్ భద్రాది కొత్తగూడెం బ్యూరో (మూర్తి)

ఎన్నికలప్పుడే రాజకీయాలని, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేతలో జెండాలు చూడనని, అర్హతే ప్రామాణికంగా, పేదల అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా పనులు చేస్తున్నానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్లోని జీవిఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా 30 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, 23 మంది లబ్దిదారులకు రూ.10 లక్షలు విలువ చేసే సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులు పంపిణీ ముందు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాయం మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పక్షపాతం లేకుండా ఎంపిక చేయాలని పార్టీ నాయకులకు, సర్పంచ్లకు, అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత ప్రజలు అప్పగించిన భాద్యతలకనుగుణంగా నిజమైన అర్హులకు, పేదలకు పథకాలు అభివృద్ధి ఎజెండాగా పని చేయాలని, ఇక్కడ లబ్దిదారుడుది ఏ పార్టీ, ఏ జెండా అనేది చూడొద్దు అని సూచించారు. గ్రామ స్థాయిలో అర్హులైన వారిని కాదని ఎంపిక చేసినా, వారి వద్ద ఎలాంటి డబ్బులు వసూళ్ల కు పాల్పడినట్టు తేలితే, సొంత పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అని కూడా చూడనని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. లబ్దిదారులకు అన్యాయం జరిగితే నేరుగా తనను కలిసి, దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు లో భాగంగా చింతలబయ్యారం ప్రముఖ శైవ క్షేత్రంలో పుష్కర ఘాట్ ఏర్పాటు కు అనుమతులు వచ్చాయని, కార్యక్రమానికి మంత్రులు రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్ లో ఆదేశించారు. మరి కొందరు పింఛన్, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు ఇప్పించాలని వినతి పత్రాలు అందజేశారు.

*సీతంపేటలో రూ 16 లక్షలు తో సీసీ రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన…

మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీలో రూ 16 లక్షలు వెచ్చించ్చి ఎస్ సీ, బీసీ కాలనీల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంఖు స్థాపన చేశారు. గ్రామంలో పెండింగ్ ఉన్న రోడ్లు త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం రూ 2.5 లక్షలతో రికన్స్ట్రక్షన్ చేసిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ పోటు సంకీర్త్, ఎంపీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు గొడిశాల రామనాధం, గంగిరెడ్డి వెంకటరెడ్డి, దాట్ల రాజేష్, గంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కంది విజయ్ భరత్, అచ్చ నవీన్, తోలెం అర్జున్, లాలయ్య, బి సాంబ, ఆరె నవీన్, కే వీరాస్వామి, పొనగంటి సాంబాశివరావు, తిరుమల రావు, హేమంత్ రెడ్డి, గుట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!