ఉపాధి మాట విని.అండగా నిలిచిన సమ్మన్న గౌడ్ !


చైతన్యనగర్ మహిళలకు రూ. 25,000/-లతో 25 జతల కోలాటం గజ్జెల పంపిణీ
సమ్మిగౌడ్ తో 2 దశాబ్దల బంధం.. బిడ్డలా,ప్రతీ కుటుంబం తో అనుబంధం – CNR కాలనీ మహిళలు
మహిళల ఉపాధికి చేయూతనిస్తూ మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
నమస్తే భారత్ :-కేసముద్రం
ఉపాధి కోసం కోలాటం ఆడతామని అడిగిన మహిళల మాట విని, వారి అవసరాన్ని తన బాధ్యతగా భావించి వెంటనే స్పందించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని చైతన్యనగర్ కాలనీకి చెందిన 25 మంది మహిళలు తమ గ్రూప్ లీడర్ కొమ్ము ఎల్లమ్మతో కలిసి వచ్చి, ఉపాధి కోసం గ్రూప్ కోలాటం కార్యక్రమాలకు వెళ్లేందుకు ఒకే రంగు దుస్తులతో పాటు కాళ్ల గజ్జెలు అవసరమని కోరారు. మహిళల నోట ఉపాధి మాట వినగానే వారి కష్టాన్ని అర్థం చేసుకున్న సమ్మయ్య గౌడ్ వెంటనే స్పందించి రూ, 25,000/- వ్యచ్చించి 25 జతల కోలాటం గజ్జెలను అందించి తన మానవీయతను చాటుకున్నారు. అంతకుముందు 25 మంది మహిళలకు కోలాటం చీరలను కూడా పంపిణీ చేశారు.చైతన్యనగర్ కాలనీతో సమ్మయ్య గౌడ్కు ఉన్నది కేవలం 26 ఏళ్ల పరిచయం మాత్రమే కాదు.ప్రతీ మనిషి తో బంధం, ప్రతీ కుటుంబం తో అంతకుమించిన ఆత్మీయ అనుబంధం.ఆ కాలనీ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా, తన అక్కా, చెల్లెళ్లుగా భావిస్తూ.అన్నదమ్ముల్లా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అండగా నిలుస్తున్నారు. కాలనీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరైనా మరణించినా సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యుడిలా తోడుగా ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఉపాధి కోసం ముందుకు వచ్చినప్పుడు వారి అవసరాన్ని గుర్తించి సహాయం చేయడం ఆయనకు వారిపట్ల ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలుస్తోంది.
కొమ్ము ఎల్లమ్మ మాట్లాడుతూ.రెండు దశాబ్దాలుగా మా కాలనీలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా మా కుటుంబంలో పుట్టిన బిడ్డలా స్పందిస్తూ, అన్నదమ్ముల్లా మా కష్టసుఖాల్లో తోడుంటున్నారు. ఉపాధి కోసం మేము ఏది అడిగినా కాదనకుండా సహాయం చేస్తున్నారు. మమ్మల్ని, మా జాతిని తన కుటుంబంలా భావించి కొండంత ప్రేమ చూపిస్తున్న మా కొడుకు, మా అన్న సమ్మన్నకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మా బృందం, చైతన్యనగర్ కాలనీ తరఫున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని భావోద్వేగంగా పేర్కొన్నారు.



