ePaper
Sunday, September 27, 2026
ePaper
Homeతెలంగాణపుల్లూరు-3 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

పుల్లూరు-3 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పుల్లూరు-3 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

నమస్తే భారత్ :-డోర్నకల్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రాజెక్టు పరిధిలోని పుల్లూరు సెక్టార్‌లో పోషణ మాసం సందర్భంగా పుల్లూరు-3 అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఇసిసిఇ డే, తల్లులకు శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారుల ప్రాథమిక విద్యాభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం తదితర అంశాలపై తల్లులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా శిశువు జననం నుంచి తొలి 1000 రోజుల ప్రణాళిక ప్రాధాన్యతను వివరించి, ఈ కాలంలో తల్లి, బిడ్డకు అందించాల్సిన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో సీడీపీఓ మేడం, సూపర్వైజర్, హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించి, తల్లులకు శ్రీమంతాలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!