ePaper
Wednesday, November 11, 2026
ePaper
Homeతెలంగాణగ్రంథాలయాలు....విద్యా భాండాగారాలు...

గ్రంథాలయాలు….విద్యా భాండాగారాలు…

📰 Generate e-Paper Clip

*_గ్రంథాలయాలు….విద్యా భాండాగారాలు…_*

*పుస్తక పఠనం ద్వారా ప్రతీ ఒక్కరూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లైబ్రరీ ప్రారంభోత్సవంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్*
*నమస్తే భారత్/ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం*
జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం 132 జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాల గ్రంథాలయాన్ని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులు మొబైల్ ఫోన్లలో సమయాన్ని వృధా చేసుకోకుండా పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. విద్యాభ్యాసంలో ఆసక్తి ఉండి పేదరికంతో విద్యకు దూరమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించి వారు విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా వారి తల్లిదండ్రులకు విద్య అవసరాన్ని తెలియజేసేలా పాఠశాల ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేలా మన నియోజకవర్గంలోనే తన సొంత నిధులతో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిగ్రీ కళాశాలలను నిర్మించడం జరిగిందని నిరుపేద విద్యార్థులు కళాశాలలను వినియోగించుకొని ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత శిఖరాలను చేరాలన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ వసుంధర, పాఠశాల ప్రిన్సిపాల్ కమల్ సింగ్, స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!