రాహుల్ గాంధీ పై అక్రమ కేసు పెట్టడం సిగ్గుచేటు – ఎంపీ బలరాం నాయక్
ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలి – ఎమ్మెల్యే మురళి నాయక్
బిజెపి కుట్రలను ఎండగడతాం – కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు – భూక్య ఉమా నాయక్.
ప్రజాస్వామ్యంలో కొట్లాడుతాం – కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్.
మహబూబాబాద్ లో కాంగ్రెస్ నాయకుల మహా ధర్నా.
నమస్తే భారత్ :-మహబూబాబాద్
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో బీజేపీ–ఆరెస్సెస్ శ్రేణులు వ్యవహరించిన వివక్షాపూరిత వైఖరిని ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలో ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ బలరాం నాయక్: “సామాజిక న్యాయం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం గళమెత్తిన రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటూ తప్పుడు కేసులు బనాయించడం లజ్జాకరం. ఖర్గే సభ ప్రాంగణాన్ని ‘శుద్ధి’ పేరిట అవమానించిన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన వారిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ కేసులను.ఉపసంహరించుకోవాలి.”ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి- ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్: “దేశంలో రాజ్యాంగ విలువలపై బీజేపీ నిరంతరం దాడి.చేస్తోంది.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది.”బిజెపి కుట్రలను ఎండగడతాం -డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళీ నాయక్: “ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలను ప్రజల మధ్య ఎండగడతాం. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు.”ప్రజాస్వామ్యంలో కొట్లాడుతాం- కేసముద్రం మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్: “అణచివేత ధోరణులను నిరసిస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటాలు కొనసాగిస్తాం. రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉందనే విషయం బీజేపీ గుర్తుంచుకోవాలి.”ఈ కార్యక్రమంలో.మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్, మండల అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్, ఇనుగుర్తి మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్‌తో పాటు స్థానిక కౌన్సిలర్లు,వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.



