ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeతెలంగాణఓటర్ల వద్ద ఫోటో గుర్తింపు కార్డులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పోలింగ్ అధికారులను...

ఓటర్ల వద్ద ఫోటో గుర్తింపు కార్డులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పోలింగ్ అధికారులను ఆదేశించారు

📰 Generate e-Paper Clip

ఓటర్ల వద్ద ఫోటో గుర్తింపు కార్డులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పోలింగ్ అధికారులను ఆదేశించారు

ఏలూరు/పెదపాడు, నవంబర్, 5 : నమస్తే భారత్ ( ప్రేమ్ కిరణ్)

ఓటు వేసేందుకు వచ్చే ఓటర్ల వద్ద ఫోటో గుర్తింపు కార్డులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పోలింగ్ అధికారులను ఆదేశించారు. పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలోని 54, 55, 56 నెంబర్ పోలింగ్ కేంద్రాలలో, పెదపాడు లోని 43, 44, 45, 46, 47, 48, 49, 50 పోలింగ్ కేంద్రాలలో గురువారం పోలింగ్ ప్రక్రియను, సరళిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియపై సిబ్బందికి 2సార్లు శిక్షణ అందించడం జరిగిందని, శిక్షణలో తెలియజేసిన అంశాలను ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణం ఎక్కడా ఎటువంటి పొరపాటుకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియను పోలింగ్ అధికారులు నిర్వహించాలన్నారు. ఓటుహక్కును.వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ సూచించిన ఫోటో గుర్తింపు కార్డులు పరిశీలించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఏదైనా సమస్య ఎదురైతే ప్రిసైడింగ్ అధికారి లేదా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ సమయంలో పోలింగ్ ను అడ్డుకునేందుకు కేంద్రం పరిసరాలలో ఎవరైనా న్యూసెన్స్ సృష్టిస్తే వెంటనే పోలీసు సిబ్బందికి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్ల క్యూ లైన్లు, పరిసరాలలో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఓటు వేసే విధానంలో గోప్యత ఉన్నదా.. లేదా.. అనే విషయాన్నీ కూడా పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లు, ఏమైనా సమస్య ఉన్నాయా అని ఓటర్లని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. సాయంత్రం పోలింగ్ పూర్తి అయినవెంటనే బ్యాలెట్ బాక్సులను బ్యాలెట్ పత్రాలతో జాగ్రత్తగా స్ట్రాంగ్ రూంలకు చేర్చాలన్నారు.కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఇంచార్జ్ ఎంపిడిఓ ఇందిరాగాంధీ, పంచాయతీ కార్యదర్శి పవన్, ప్రభృతులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!