ePaper
Friday, July 3, 2026
ePaper
Homeఎడిటోరియల్లడఖ్‌లో రెండు శిఖరాలు అధిరోహించిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్‌కు గోవా ముఖ్యమంత్రి అభినందనలు

లడఖ్‌లో రెండు శిఖరాలు అధిరోహించిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్‌కు గోవా ముఖ్యమంత్రి అభినందనలు

📰 Generate e-Paper Clip

లడఖ్‌లో రెండు శిఖరాలు అధిరోహించిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్‌కు గోవా ముఖ్యమంత్రి అభినందనలు

అధికారిక నివాసంలో ఘన సన్మానం చేసిన సీఎం డా. ప్రమోద్ సావంత్

నమస్తే భారత్ :-మరిపెడ

లడఖ్‌లోని రెండు పర్వత శిఖరాలను విజయవంతంగా అధిరోహించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్‌ను గోవా ముఖ్యమంత్రి డా. ప్రమోద్ సావంత్ తన అధికారిక నివాసంలో ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించి, ఆయన సాధించిన విశిష్ట విజయాన్ని కొనియాడారు.ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన యశ్వంత్ నాయక్ లడఖ్‌లోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు, మంచుతో కప్పబడిన శిఖరాలను అధిరోహించిన అనుభవాలను వివరించారు. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని రెండు శిఖరాలను విజయవంతంగా అధిరోహించడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి డా. ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచేలా మరిన్ని శిఖరాలను అధిరోహించి దేశానికి, రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం అందుకోవడం తన జీవితంలో మరపురాని ఘట్టమని భూక్యా యశ్వంత్ నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. తన కృషిని గుర్తించి అభినందించిన గోవా ముఖ్యమంత్రి డా. ప్రమోద్ సావంత్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు.తెలిపారు.భవిష్యత్తులో కూడా మరిన్ని సాహసయాత్రలు చేపట్టి దేశానికి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!