ePaper
Friday, July 3, 2026
ePaper
Homeఎడిటోరియల్తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు శ్రీమతి జ్యోత్స్న శివారెడ్డి కుత్బుల్లాపూర్ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ షాపూర్ నగర్...

తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు శ్రీమతి జ్యోత్స్న శివారెడ్డి కుత్బుల్లాపూర్ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు

📰 Generate e-Paper Clip

July 2nd, 2026.

ప్రెస్ నోట్

తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు శ్రీమతి జ్యోత్స్న శివారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్ షాపూర్ నగర్ పాఠశాలను సందర్శించారు

తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు శ్రీమతి జ్యోత్స్న శివారెడ్డి కుత్బుల్లాపూర్ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా CURE నిధులతో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు.

పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. CURE నిధులతో చేపడుతున్న పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, స్కావెంజర్ నిధులు, CURE నిధులు, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వంటి కార్యక్రమాలు అమలవుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమం గణనీయంగా మెరుగుపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!