21 ఏండ్లుగా రక్తదాన చైతన్య యుద్ధంలో ” స్విమ్మర్ రాజు “
ప్రపంచ రక్తదాతల దినోత్సవం
నర్సంపేట జూన్ 13 ( నమస్తే భారత్ ) :
రక్తదాన చైతన్య యుద్ధంలో నేను సైతం అంటూ వరంగల్ పోలీస్ కానిస్టేబుల్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్
కన్నె రాజు (స్విమ్మర్ రాజు) గత 21 సంవత్సరాలుగా రక్తదానం పై యువతకు అవగాహన కల్పిస్తూ పలుమార్లు రక్తదానం ,రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచాడు.వరంగల్ జిల్లా, ఖానాపురం మండలం, రాగంపేట గ్రామానికి చెందిన కన్నె కుమారస్వామి – రమనీల దంపతుల పెద్ద కుమారుడు బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు). తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సిటీ ఆర్మ్డ్ రిజర్వు ఏ.ఆర్ 2009 బ్యాచ్ (వరంగల్ సిటీ గార్డ్)లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 2005వ సంవత్సరం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఖానాపురం లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్న రోజులలో తేదీ. 28/08/2005 రోజున ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ లో మొట్ట మొదటి సారి రక్తదానం చేయడం జరిగింది. రక్తం దొరకకుండా ఎవరు ఇబ్బంది పడొద్దు. ఎవరు కూడా రక్తం దొరకకుండా చనిపోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ” రక్తదాన చైతన్య యుద్ధంలో నేను సైతం అంటూ” నేను ఈ రక్తదాన చైతన్య కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని కన్నె రాజు (స్విమ్మర్ రాజు) తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
2005 సంవత్సరం నుండి నేను ఇప్పటి వరకు 37సార్లు (ఓ పాజిటివ్) రక్తదానం చేయడం జరిగింది. 2005 సంవత్సరం నుండి యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నేను 5 రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా) రాష్ట్రాలలో (వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా) 1,00,000 మందికి పైగా యువత కు రక్తదానం పై అవగాహన కల్పించడం జరిగింది. గత 21 సంవత్సరాలుగా వివిధ అత్యవసర సమయంలో ఉన్నవారికి 18,469 మందికి, రక్తదాతల సహకారంతో ఉచితంగా రక్తాన్ని అందించడం జరిగింది. అత్యవసరం లో ఉన్న వారికోసం మరియు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇప్పటి వరకు 78 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరోన (కోవిడ్ – 19) అత్యవసర సమయంలో ప్లాస్మాదానం పై అవగాహన కల్పించి 235 మందికి ప్లాస్మా అందించడం జరిగింది. జూన్ 14, 2026 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు పూర్తయిన యువతి ,యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా ఉండాలని కోరుచున్నాను. ఎవరికైనా అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉన్నవారు, స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనుకునేవారు వరంగల్ పోలీస్ కానిస్టేబుల్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్
కన్నె రాజు (స్విమ్మర్ రాజు). 9490115105 సెల్ ఫోన్ నెంబర్ కు సంప్రదించగలరు. అదేవిధంగా ఈ సందర్భంగా నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా యొక్క కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, వరంగల్ పోలీస్ శాఖకు, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ సభ్యులకు, రక్తదాతలకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

