ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఎడిటోరియల్పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలి

పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలి

📰 Generate e-Paper Clip

పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య.డిమాండ్ చేశారు

నమస్తే భారత్:-మరిపెడ

పెరిగిన ధరలకు అనుగుణంగా రెక్కల కష్టం పై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు గ్రామ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సంఘం మండల కార్యదర్శి బాణాల రాజన్న గుండ గాని మధుసూదన్ హాజరు కాగా వీరయ్య కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడం వల్ల వ్యవసాయ కార్మికులు కొని తినలేని పరిస్థితులలో ఉన్నారని కూలీల కూలీల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.పట్టించుకోవడంలేదని పాలకులు ఇచ్చిన హామీలు భూమి లేని వ్యవసాయ కార్మికులకు ప్రతి ఏట 12 వేల రూపాయలు మహిళలకు 2500 రూపాయలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 150 రోజుల పెంపు రోజు కూలి 400 పట్టణ ప్రాంతాల్లో పనులు కల్పించడం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు రేకుల ఇండ్లతో జీవనం గడుపుతున్న వ్యవసాయ కార్మికులకు స్లాపు వేసుకోవడానికి మూడు లక్షల రూపాయలు హరులైన వారందరికీ పెన్షన్స్ పెన్షన్స్ పెంపు తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బాణాల రాజన్న మండల నాయకులు గుండ గాని మధుసూదన్ గ్రామ నాయకులు తాడూరి వీరేంకులు వ్యవసాయ కూలీల గుంపు మేస్త్రిలు బత్యం వీరన్న బత్యం స్వరూప గాడి పెళ్లి ఉపేంద్ర దుండి నరసమ్మ షేక్ సైదులు షేక్ జానీ వంగూరు ఎలేంద్ర ఆలేటి భారతమ్మ ఉర్లుగొండ పద్మ కండి రజిత దుండి ముత్తి లింగమ్మ అయినాల ఎల్లమ్మ మరియు కూలీలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!