ePaper
Monday, November 16, 2026
ePaper
Homeతెలంగాణరజిత కలశం ఆలయానికి బహుకరణ

రజిత కలశం ఆలయానికి బహుకరణ

📰 Generate e-Paper Clip

రజిత కలశం ఆలయానికి బహుకరణ

ఖానాపురం, నవంబర్ 14 (మల్లేష్ నమస్తే భారత్):

మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.35,016 విలువైన రజత కలశాన్ని భక్తిశ్రద్ధలతో బహుకరించారు. మండల కేంద్రానికి చెందిన వేములపల్లి హనుమంతరావు జ్ఞాపకార్థం ఆయన తమ్ముని కుమారులు వేములపల్లి మణిదీప్, జగదీప్ తమ పెదనాన్న స్మారకంగా ఈ రజత కలశాన్ని ఆలయానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పర్వతపు శివప్రసాద్ శాస్త్రి రజత కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల తరఫున ఆలయ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావుకు రజత కలశాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయానికి విలువైన కానుకను అందించిన వేములపల్లి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!