రజిత కలశం ఆలయానికి బహుకరణ

రజిత కలశం ఆలయానికి బహుకరణ ఖానాపురం, నవంబర్ 14 (మల్లేష్ నమస్తే భారత్): మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.35,016 విలువైన రజత కలశాన్ని భక్తిశ్రద్ధలతో బహుకరించారు. మండల కేంద్రానికి చెందిన వేములపల్లి హనుమంతరావు జ్ఞాపకార్థం ఆయన తమ్ముని కుమారులు వేములపల్లి మణిదీప్, జగదీప్ తమ పెదనాన్న స్మారకంగా ఈ రజత కలశాన్ని ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పర్వతపు శివప్రసాద్ శాస్త్రి రజత కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల తరఫున ఆలయ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావుకు...