చండూరులో ప్రారంభమైన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

చండూరులో ప్రతిష్ఠా విగ్రహాల భారీ ఊరేగింపు
14,15,16 మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం
చండూర్ మరో కిరణాలు నవంబర్ 14
చండూరు లో నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో . అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగరాజు, మాళికాపురత్తమ్మ దేవీల విగ్రహం మరియు ధ్వజ స్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, మహాపడి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం జలాధివాసం నిర్వహించనున్నారు. ఉదయం ప్రతిష్ఠా విగ్రహాలను చండూర్ పొలిమేర నుంచి పుర వీధుల గుండా భారీ ఊరేగింపు చేయనున్నారు. కేరళ వాయిద్యాలతో కోలాటాల నడుమ సభతో నభవిష్యత్తుగా సాగనుంది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జలాధివాసానికి భక్తులు ప్రతి ఇంటి నుంచి ఒక బిందెడు నీళ్లు తీసుకొచ్చారు. 15న క్షీరాధివాసము, ధాన్యాధివాసము, ఫలపుష్ప. శయ్యాధివాసములు నిర్వహించారు. ధాన్యాధివాసానికి ఉదయం 10 గంటలకు ప్రతి ఇంటి నుంచి భక్తులు శేరుంభావు ఆపై శక్తి మేరకు బియ్యం తేనున్నారు. 16న ఉదయం అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహం, పరివార దేవతలు మరియు యంత్ర ప్రతిష్ఠాపనములు జరపబడును. ప్రతిష్ట మహోత్సవం జరుగు 14,15,16
తేదిలలో మధ్యాహ్నం వేళలో పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. 18న దేవాలయ పదునెట్టాంబడికి మహాపడి పూజ కార్యక్రమము నిర్వహించనున్నారు. ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి-లక్ష్మీ దంపతులు హాజరుకానున్నారు. ప్రతిష్టాపన మహోత్సవం
ఇప్పటికే చందూరు పండుగ వాతావరణం. ప్రతిష్ఠాపన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లు ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు డా. కోడి శ్రీనివాసులు అన్నారు. విరాళాలు ఇవ్వాలనుకుంటున్న దాతలు 9440481414 కు సంప్రదించాలని తెలిపారు.



