*బీజేపీ తెచ్చిన ఎన్ ఈ పి ను తెలంగాణలో అమలు చేయడమే రేవంత్ రెడ్డి టార్గెటా?*
*ఇంటర్లో మార్పులకు ముందు అన్ని వర్గాలతో విస్తృత చర్చ జరపాలి*
*స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి*
*జూనియర్ కాలేజీల భవిష్యత్తు ఏంటి..??*
మమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ఎన్ ఈ పి-2020ను తెలంగాణలో అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని పసుపుల ప్రశాంత్ అన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మార్పులు, 11–12 తరగతులను పాఠశాల విద్యలో భాగం చేయడం వంటి ప్రతిపాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో, తెలంగాణ అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర విధానాన్ని యథాతథంగా అమలు చేయడం సరికాదన్నారు.ఇంటర్ విద్య అనేది కేవలం రెండు సంవత్సరాల చదువు కాదు.. లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షలు, వృత్తి విద్యకు కీలకమైన దశ. అందువల్ల ఇందులో మార్పులు తీసుకురావాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యా నిపుణులు, విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రశాంత్ కోరారు.ఇంటర్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టత ఏది?ఇంటర్ విద్యా విధానంలో మార్పులు వస్తే విద్యార్థుల ఉన్నత విద్య ప్రవేశాలు, పోటీ పరీక్షల సన్నద్ధత, వృత్తి విద్యలో అవకాశాలు, పరీక్షల విధానం వంటి అంశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ప్రభుత్వం ముందుగా అధ్యయనం చేయాలని ప్రశాంత్ అన్నారు. “ఒక విధానంలో మార్పు చేయడం కంటే, ఆ మార్పు తర్వాత విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రభుత్వం ముందుగా చెప్పాలి” అని పేర్కొన్నారు.స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ సంగతేంటి?ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు అందుతున్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర ప్రభుత్వ విద్యా ప్రయోజనాలు కొత్త విద్యా విధానంలో కూడా కొనసాగుతాయా? వాటి అర్హతలు ఎలా ఉంటాయి? పేద, గ్రామీణ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? అనే విషయాలపై ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇవ్వాలని ప్రశాంత్ డిమాండ్ చేశారు.విద్యా విధానాన్ని మార్చే ముందు విద్యార్థులకు అందుతున్న ప్రయోజనాల భవిష్యత్తు ఏమిటో చెప్పాలి. స్పష్టత లేకుండా మార్పులు వస్తే ఎక్కువగా నష్టపోయేది పేద విద్యార్థులే” అని అన్నారు.జూనియర్ కాలేజీలు, అధ్యాపకుల పరిస్థితి ఏంటి?ఇంటర్ విద్యా వ్యవస్థలో మార్పులు వస్తే ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశాంత్ అన్నారు. అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత, సర్వీస్ నిబంధనలు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులపై ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.పేద విద్యార్థులపై అదనపు భారం పడకూడదు గ్రామీణ ప్రాంతాలు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రధాన ఆధారమని ప్రశాంత్ తెలిపారు. కొత్త విధానం వల్ల ప్రభుత్వ విద్య మరింత బలోపేతం అవుతుందా, లేక ప్రైవేట్ విద్యపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని అన్నారు.కేంద్రం తీసుకొచ్చిన విధానం కాబట్టి అమలు చేయడం కాదు.. తెలంగాణకు ఏది అవసరం, తెలంగాణ విద్యార్థులకు ఏది ఉపయోగకరం అనేదే ప్రాతిపదిక కావాలి” అని ప్రశాంత్ స్పష్టం చేశారు.సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలిఇంటర్ విద్యలో ప్రతిపాదిస్తున్న మార్పులపై ప్రభుత్వం ముందుగా సమగ్ర అధ్యయనం చేయాలని, ఆ అధ్యయన నివేదికను ప్రజల ముందుంచాలని ప్రశాంత్ కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా నిపుణులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీజేపీ తీసుకొచ్చిన ఎన్ ఈ పిను తెలంగాణలో అమలు చేయడమే లక్ష్యంగా కాకుండా.. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పసుపుల ప్రశాంత్ కోరారు.



