ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeతెలంగాణనవంబర్ 15 అఖిలభారత రైతు బహిరంగ సభ కు కదిలి రావాలి

నవంబర్ 15 అఖిలభారత రైతు బహిరంగ సభ కు కదిలి రావాలి

📰 Generate e-Paper Clip

నవంబర్ 15 అఖిలభారత రైతు బహిరంగ సభ కు కదిలి రావాలి

మోడీ హయంలో వ్యవసాయ రంగం నిర్వీర్యం

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య

నమస్తే భారత్ :-మరిపెడ

నవంబర్ 15న నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు బహిరంగ సభ కు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు దళితులు గిరిజనులు కదలి రావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి హల్వాల వీరయ్య పిలుపునిచ్చారు నవంబర్ 12న ఎల్లంపేట గ్రామంలో బహిరంగ సభను జయప్రదం కోసం ప్రచారం నిర్వహించారు అనంతరం వీరయ్య మాట్లాడుతూ రైతాంగ హక్కులు వ్యవసాయ రంగంలో రక్షణ కోసం దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న రైతు మహాసభలు నల్లగొండ జిల్లాలో నాలుగు రోజుల పాటు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు కొనసాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ ముఖ్య భూమిక పోషించింది జిల్లాలో అనేక సంవత్సరాలుగా వర్షాధారం బావులు బోర్లు విద్యుత్ మోటార్లపైన ఆధారపడి వ్యవసాయం కొనసాగుతున్న తరుణంలో అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సారెస్పీ ఉపకాల్వలైన గన్నవరం తీగలవేణి కాలువలను సాధించుకుందామని ఎల్ నేను ప్రభావంతో వర్షాలు పడక పంటలు తగ్గిపోయి రైతంగ పరిస్థితి దారుణంగా ఉందని ఇట్లాంటి స్థితిలో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి నష్టపోయిన పంటలకు ఎకరాకు 30 వేల చొప్పున ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు 200 రోజులు ఉపాధి పని దినాలు కల్పించి రోజు వేతనం 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు మోడీ ఆయంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిందని 2025 విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి విద్యుత్తుకు రైతులను దూరం చేసే ప్రమాదం ఉందని వారన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు తాడూరు వీరేంకులు స్థానిక సంఘం నాయకులు చనిపోయిన లాలయ్య అల్వాల పురుషోత్తం తాడూరి యాకయ్య వ్యవసాయ కూలీల గుంపు మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!