ePaper
Tuesday, November 10, 2026
ePaper
Homeతెలంగాణఇందిరా నగర్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఇందిరా నగర్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

ఇందిరా నగర్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ప్రజావాణిలో అధికారులకు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వినతిపత్రం అందజేసిన కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్

నమస్తే భరత్ నవంబర్ 9 రిపోర్టర్ శ్రీనివాస్: గ్రేటర్ హైదరాబాద్ 123వ డివిజన్ పరిధిలోని గంధంగూడ ఇందిరా నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, కాలనీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్ కోరారు.స్థానిక నాయకులు నల్లగొప్పుల హరీష్ గౌడ్ చొరవతో ఇందిరా నగర్ కాలనీ వాసులు రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, కాలనీలో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, స్వీట్లు అందజేశారు.
అనంతరం కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మరో వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా కాలనీలో అధ్వానంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, వీధి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కల్పించాలని, మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న పాత మంచినీటి ట్యాంకును మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం ద్వారా కాలనీ ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా అందేలా శాశ్వత చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, పుష్పరాజ్, పరశురాం, సాంబ, రాములు, మల్లేష్, మహదేవ్‌తో పాటు ఇందిరా నగర్ కాలనీ మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!