ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeఎడిటోరియల్పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే జనతా ట్రస్ట్ లక్ష్యం

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే జనతా ట్రస్ట్ లక్ష్యం

📰 Generate e-Paper Clip

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే జనతా ట్రస్ట్ లక్ష్యం

ఖానాపురం నవంబర్ 4(మల్లేష్ నమస్తే భారత్) :
“ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి. పేదవాడికి ఆరోగ్యం అందించడమే నిజమైన సేవ” అని జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.
నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలంలో ఫంక్షన్ హాల్‌లో జనతా ట్రస్ట్, బంధన్ హాస్పిటల్స్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, ఐదో విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బున్నవారికి ఎక్కడైనా వైద్యం అందుబాటులో ఉంటుందని, పేదవారి ఇంటి ముందుకే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా తీసుకురావడమే జనతా ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి మండలంలో ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తామని, డబ్బులేని కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదని అన్నారు.
శంకర కంటి ఆసుపత్రి నిపుణులైన వైద్యులు సుమారు 976 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 476 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి శస్త్రచికిత్స అవసరమైన 66 మందిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వీరందరికీ హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడంతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేస్తామని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
బంధన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ట్రామా, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ విభాగాలకు చెందిన సుమారు 12 మంది స్పెషలిస్ట్ వైద్యులు శిబిరంలో పాల్గొని 268 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందించారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, పల్మనాలజీ, గైనకాలజీ, డెంటల్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్రిటికల్ కేర్ విభాగాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
అంతేకాకుండా బంధన్ హాస్పిటల్‌లో తమ ద్వారా అందించే వివిధ ఆపరేషన్లు, చికిత్సలకు ప్రత్యేక రాయితీలు, ఆఫర్లు కల్పిస్తామని ఆసుపత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది.ఈ కార్యక్రమంలో జనతా ట్రస్ట్ సభ్యులు, బంధన్ హాస్పిటల్స్, శంకర కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!