ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeతెలంగాణమున్సిపాలిటీ విజేతలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అభినందనలు

మున్సిపాలిటీ విజేతలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అభినందనలు

📰 Generate e-Paper Clip

మున్సిపాలిటీ విజేతలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అభినందనలు
‎
‎నమస్తే భారత్ నవంబర్ 3

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయంపై ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం కౌంటింగ్ ముగిసే సమయానికి జంగారెడ్డిగూడెం చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చైర్‌పర్సన్ అభ్యర్థి రొంగల అనూష, విజయం సాధించిన వార్డు కౌన్సిలర్లను స్వయంగా కలిసి  హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!