ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeఎడిటోరియల్కొందుర్గులో నదులున్నాయా? కాలువలున్నాయా? మరి కరువు మండలంగా ఎందుకు ప్రకటించరు?

కొందుర్గులో నదులున్నాయా? కాలువలున్నాయా? మరి కరువు మండలంగా ఎందుకు ప్రకటించరు?

📰 Generate e-Paper Clip

కొందుర్గులో నదులున్నాయా? కాలువలున్నాయా? మరి కరువు మండలంగా ఎందుకు ప్రకటించరు?

అప్పుల ఊబిలో రైతులు.. ఆదుకునే వారేరీ? కొందుర్గుకు కరువు సాయం అందించాలి!

కొందుర్గు రైతుల గోస వినండి.. తక్షణమే కరువు మండలంగా ప్రకటించండి! – పసుపుల ప్రశాంత్

నమస్తే భారత్ షాద్ నగర్,అక్టోబర్ 28:కరువు మండలాల జాబితాలో కొందుర్గు మండలానికి చోటు కల్పించకపోవడం పట్ల పసుపుల ప్రశాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, పంటలు ఎండిపోయి, పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో కొందుర్గు మండలాన్ని కరువు మండలాల జాబితా నుంచి ఎలా మినహాయిస్తారని ఆయన ప్రశ్నించారు.కొందుర్గు మండలం ఏమైనా ధనిక మండలమా? ఇక్కడి రైతులంతా లక్షాధికారులా? రైతుల పొలాల్లో పంటలు ఎండిపోతుంటే, బోర్లలో నీళ్లు అడుగంటిపోతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా? మన మండలంలో నదీ జలాలు, సాగునీటి కాలువలు, పెద్ద చెరువుల ద్వారా నిరంతర సాగునీటి సౌకర్యం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.ఇప్పటికే సుమారు 10 శాతం మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అందకపోవడంతో బ్యాంకుల్లో కొత్త రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పంట నష్టాలు, మరోవైపు పెరిగిన నిత్యావసర ధరలు, అప్పుల భారం రైతు కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు.పంటలు పండక రైతు కన్నీరు పెడుతుంటే, కరువు జాబితాలో పేరు లేకపోవడం రైతులకు మరో అన్యాయం కాదా? రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కొందుర్గు మండలంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను తక్షణమే పరిశీలించి, పంట నష్టం, భూగర్భ జలాల పరిస్థితి, రైతుల ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని కొందుర్గు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి. అర్హులైన రైతులకు కరువు సహాయం అందించి, రుణమాఫీ సమస్యలను పరిష్కరించాలి.
రైతుల కన్నీళ్లకు విలువ లేదా? కొందుర్గు రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైతుల పక్షాన పోరాడుతాం! అని పసుపుల ప్రశాంత్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!