ఆర్నబ్ తుఫాన్ ప్రభావం
భద్రాద్రి జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27: ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నెల 28న (బుధవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ అంకిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతికూల వాతావరణం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన కలెక్టర్, సంబంధిత అధికారులు ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.



