బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతిరెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన బొమ్మెర మహేందర్ గౌడ్ ఇటీవల మరణించడంతో విషయం తెలుసుకున్న తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి శనివారం బాధిత కుటుంబాన్ని సందర్శించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మారపు మహేందర్,ఉపసర్పంచ్ జినుగ రవీందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎక్కటి నాగిరెడ్డి, మండల నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు బీరెల్లి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



