ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeతెలంగాణతొర్రూరులో అప్పలు చేస్తున్న కౌన్సిలర్ బి.ఐలమ్మ

తొర్రూరులో అప్పలు చేస్తున్న కౌన్సిలర్ బి.ఐలమ్మ

📰 Generate e-Paper Clip

తొర్రూరులో అప్పలు చేస్తున్న కౌన్సిలర్ బి.ఐలమ్మ

దసరా పండగ వేళ పిండి వంటల సందడి!

పండుగకు ముందే ప్రారంభమైన సందడి.

సంప్రదాయ వంటకాల తయారీలో మహిళలు బిజీ

నమస్తే భారత్ :-తొర్రూరు

:దసరా పండుగను పురస్కరించుకుని ఇళ్లలో పిండి వంటల సందడి మొదలైంది. పండుగకు ముందుగానే మహిళలు వివిధ రకాల సంప్రదాయ పిండి వంటలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.తెలుగు సంప్రదాయంలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉండటంతో ఇంటిల్లిపాది కలిసి పిండి వంటలు తయారు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అరిసెలు, సకినాలు, గారెలు, బూరెలు, లడ్డూలు తదితర వంటకాలను తయారు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇంట్లోనే వంటకాలు తయారు చేసుకుంటుండగా, మరికొందరు అవసరమైన పిండి పదార్థాలను ముందుగానే కొనుగోలు చేస్తున్నారు.పండుగ నేపథ్యంలో.బియ్యం,బెల్లం,నూనె,నువ్వులు, పప్పులు తదితర సరుకుల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి వంటలు తయారు చేసుకోవడం ద్వారా పండుగ వాతావరణం మరింత సందడిగా మారుతోంది. సంప్రదాయ వంటకాలతో ఇంటిల్లిపాది కలిసి పండుగను జరుపుకునేందుకు ప్రజలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. తొర్రూరులో పిండి వంటలు చేస్తున్న 13వ వార్డు కౌన్సిలర్ బసనబోయిన ఐలమ్మ మాట్లాడుతూ దసరా సందర్భంగా పిండివంటలు చేసుకుంటామని, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా రకరకాల వంటకాలు సిద్ధం చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!