ePaper
Wednesday, October 7, 2026
ePaper
Homeఎడిటోరియల్శస్త్రచికిత్స అనంతరం అచ్చ శ్రీనివాస్‌ ను పరామర్శ

శస్త్రచికిత్స అనంతరం అచ్చ శ్రీనివాస్‌ ను పరామర్శ

📰 Generate e-Paper Clip

శస్త్రచికిత్స అనంతరం అచ్చ శ్రీనివాస్‌ ను పరామర్శ

డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు.రామచంద్రనాయక్

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అచ్చ శ్రీనివాస్ ఇటీవల కాలు శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే.డాక్టర్.జాటోతు.రామచంద్రనాయక్ కలిసి మంగళవారం మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ పరామర్శ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్, కౌన్సిలర్లు మెరుగు రాము, జాటోతు సురేష్, జియో రమేష్, కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు విజయ్, గంధసిరి భిక్షపతి, బోడ రవి, సయ్యద్ సర్వర్ పాషా, సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!