*ది ప్యారడైజ్ మూవీలో రాక్ డాన్స్ అకాడమీ విద్యార్థుల స్టెప్పులు*


*ప్రముఖ డాన్స్ మాస్టర్ ల నుండి శభాష్ అనిపించుకున్న షాద్ నగర్ రాక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు*
*తెలంగాణ యాసా భాష మన సంస్కృతి* *సంప్రదాయాలకు* *నిలువెత్తు నిదర్శనమే ది పారడైజ్ సినిమా*
*తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా.*
*ప్రముఖ కొరియోగ్రాఫర్ అన్వర్ మాస్టర్ అభినందనలు వెల్లువ*
*విద్యార్థులను సన్మానించిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు ఎండి ముస్తఫా*
నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్24: రంగారెడ్డి షాద్ నగర్ ప్రముఖ సినీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డూరి తీసిన దీ పారడైజ్ సినిమాలో షాద్ నగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు పాత్ర పోషించడం అభినందనీయమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా పేర్కొన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అన్వర్ మాస్టర్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ది పారడైజ్ సినిమాలోని ఒక పాటకు డ్యాన్స్ చేశారు. దాంతో చిన్నారి విద్యార్థులను శాలువాలతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎండి ముస్తఫా మాట్లాడుతూ ది ప్యారడైజ్ సినిమా తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యత ఇస్తూ తీయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆ సినిమాలో షాద్ నగర్ పట్టణానికి చెందిన చిన్నారి విద్యార్థులు పాల్గొని ముఖ్యపాత్ర పోషించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టాలెంట్, ప్రతిభ ఎవరి సొత్తు కాదని, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అన్వర్ మాస్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సినిమాల స్థాయికి విద్యార్థులను తీసుకువెళ్తున్నారంటే ఏ స్థాయిలో కష్టపడుతున్నారో అర్థమవుతుందని వివరించారు. ఇదే తరహాలో క్రమశిక్షణకు మారుపేరుగా మెలుగుతూ ఇచ్చిన టాస్కులను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ సినీ రంగంలో రాణించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అన్వర్ మాస్టర్ మాట్లాడుతూ మా అకాడమీకి వచ్చే విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన డాన్స్ నేర్పించడం జరుగుతుందని వివరించారు. ది ప్యారడైజ్ సినిమాలోనే కాకుండా మరెన్నో సినిమాల్లో మా విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలిపారు. మమ్మల్ని ప్రోత్సహించేందుకు ఎండి ముస్తఫా ముందుకు రావడం ఎంతో అభినందనీయమని, ఇదే తరహాలో మున్ముందు చేయబోయే ప్రోగ్రాములలో ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. టాలెంట్ కలిగిన విద్యార్థులను సినిమా స్థాయికి తీసుకు వెళ్లేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వివరించారు. మా స్టూడియోలో ఉన్న డాన్స్ మాస్టర్లు ఎంతో టాలెంట్ కలిగి ఉన్నారని, అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్నారని వివరించారు. ఇదే తరహాలో అన్ని వర్గాల విద్యార్థులకు టాలెంట్ నిలబెట్టుకునే విధంగా తగిన అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ది ప్యారడైజ్ సినిమాలోని పాటకు అవకాశం కల్పించిన సినిమా డైరెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన షాబాద్ మండల అధ్యక్షుడు నవీన్. నాయకుడు మహేష్. తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.



