రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉమేష్‌ను పరామర్శించిన నవీన్ రావు
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 3వ వార్డుకు చెందిన వెన్నె నాగరాజు కుమారుడు వెన్నె ఉమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ఉమేష్ ప్రస్తుతం ఇంటి వద్ద వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు ఆదివారం ఉమేష్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఉమేష్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, ప్రస్తుతం ఆయనకు అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.ఉమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని నవీన్ రావు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అవసరమైన సమయంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రేఖ వెంకటేశ్వర్లు, గంధసిరి కృష్ణ, కొంచెర్ల రవి, కొండ వెంకన్న, జినక చిన్న పాపయ్య తదితరులు పాల్గొన్నారు



