ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeఎడిటోరియల్పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

📰 Generate e-Paper Clip

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నమస్తే భారత్ :-తొర్రూరు

అంగన్వాడి కేంద్రాలలో అందించే పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటోత్ గంగ నరేష్ అన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహించే పోషణ మాసంలో పోషకాహారంపై గురువారం గ్రామంలోని కర్రే భిక్య తండా అంగన్వాడి సెంటర్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగా నరేష్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పోషకాలతో కూడిన ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యకర జీవన శైలి పెంపొందించుకోవాలని కోరారు. అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వి.భారతి, బాలింతలు,గర్భిణీలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!