ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

నమస్తే భారత్ :-తొర్రూరు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరానారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు.
వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్థంతిని గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనం ఎదురుగా అమరవీరుల స్థూపం వద్ద రజక వృత్తి దారులు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివని అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి అని కొనియాడారు. సామాజిక అన్యాయం, జమీందారీ వ్యవస్థ, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా పోరాడి అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని.పేర్కొన్నారు.ఉద్యమ నాయకురాలు వీరనారి చాకలి ఐలమ్మ పాలకుర్తి గడ్డ పై జన్మించడం.గర్వకారణమన్నారు.ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కర్నే నాగరాజు,పేర్ల జంపన్న, సిపిఎం మండల కార్యదర్శి ఎండి యాకూబ్,టియుటిఎఫ్ నాయకులు నాగ మల్లయ్య, ఓరుగంటి చైతన్య,బిజెపి పట్టణ అధ్యక్షుడు పైండ్ల రాజేష్,తొర్రూరు రజక సంఘం మండల అధ్యక్షుడు నిమ్మల సోమయ్య,కార్యదర్శి పొడగంటి శేఖర్,పట్టణ అధ్యక్షుడు చింతల రాజు, కార్యదర్శి చింతల మధు,నాయకులు సిరి శ్రీనివాస్, వెంకటయ్య, ఓరుగంటి ప్రవీణ్, చంటి, దేవేందర్,మడిపెద్ది కార్తిక్,కొండ్రతి రామక్రిష్ణ,సైదులు,రాకున్నా, శ్రీకాంత్, శ్రీనివాస్,బిక్షం,రాజేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!