ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeతెలంగాణబాలికలు తప్పనిసరిగా హెచ్ పివీ టీకా వేసుకోవాలి

బాలికలు తప్పనిసరిగా హెచ్ పివీ టీకా వేసుకోవాలి

📰 Generate e-Paper Clip

బాలికలు తప్పనిసరిగా హెచ్ పివీ టీకా వేసుకోవాలి

వైద్యాధికారి డాక్టర్ జ్యోతి

ఖానాపురం సెప్టెంబర్ 9(నమస్తే భారత్ ) :
బాలికలకు సురక్షితమైన టీకా హెచ్ పివీ వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేసుకోవాలని ఖానాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ జ్యోతి అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ పివీ వ్యాక్సిన్ ప్రోగ్రాం జరిగింది.
జ్యోతి బా పూలే రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినీలకు హెచ్ పివీ వ్యాక్సిన్ వేశారు.ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ
ఏప్రిల్ 1 నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ పివీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం
కొనసాగుతుందన్నారు.
ఇప్పటివరకు 240 మంది పిల్లలకు హెచ్ పివీ వ్యాక్సిన్
వేయడం జరిగిందని తెలిపారు.మిగతా అన్ని స్కూళ్లకు ఎంఈఓ ద్వారా, వైద్య సిబ్బంది ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు.హెచ్ పివీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మండల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.వ్యాక్సిన్
14 సంవత్సరాలు నిండిన
15 సంవత్సరాలు పడని వారు (14 నుండి 15 లోపు) బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు
ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదన్నారు.హెచ్ పివీ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ ,జననేంద్రియ క్యాన్సర్, గొంతు క్యాన్సర్,
హ్యూమన్ పాపిలోమా వైరస్ కు సంబంధించిన క్యాన్సర్లను నివారిస్తుందని వివరించారు.చాలా సురక్షితమైన టీకా కావున
బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పని దినాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు వ్యాక్సిన్ వేస్తారని తల్లిదండ్రుల అనుమతి ,
ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ చిన్ని, ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాస్ చారి ,
హెల్త్ సూపర్వైజర్ దామోదర్ రెడ్డి ,
ల్యాబ్ టెక్నీషియన్ వేణు గోపాల్ ,హెల్త్ అసిస్టెంట్స్
గొడిశాల భాస్కర్ ,మోక్ష మేరీ ,జ్యోతిబాపూలే నర్సింగ్ ఆఫీసర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!