ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణసెప్టెంబర్ 1న టిజిఈ జెఏసి పిలుపు మేరకు తపస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.

సెప్టెంబర్ 1న టిజిఈ జెఏసి పిలుపు మేరకు తపస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.

📰 Generate e-Paper Clip

సెప్టెంబర్ 1న టిజిఈ జెఏసి పిలుపు మేరకు తపస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.

నమస్తే భారత్,, 1/9/2026/ నారాయణపేట జిల్లా

కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

హైదరాబాద్, సెప్టెంబర్ 1, 2026:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆరు నెలల్లోపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలులో ఉన్న కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూTGE JAC పిలుపు మేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న మక్తల్ మండలం లోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ ఆర్థిక భద్రతకు పాత పెన్షన్ విధానం ఎంతో కీలకమైనదని తపస్ పేర్కొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల న్యాయమైన డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించి కొత్త పెన్షన్ విధానాన్ని (NPS/కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం) వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్‌కు భద్రత కల్పించాలి అని తపస్ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున,ప్రధాన కార్యదర్శి రవీందర్,జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ రాములు, తులజారామ్,ప్రహ్లాద్,అపర్ణ,శిరీష మండల గౌరవ అధ్యక్షులు నర్సిరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు నరసింహ, రాకేష్ ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య గౌడ్,లలితా బాయి,జాకీర్ హుస్సేన్,నాగేశ్వరయ్య సంఘ సభ్యులు రాజంజ నేయులు,అనిల్ రెడ్డి, జగదీశ్,రాము గౌడ్, రామాంజనేయులు,ప్రవర్ధన్, రమేష్,రవీందర్ రెడ్డి,ఆంజనేయులు, రాజ్ గోపాల్,శంకరయ్య,శ్రీనివాస్,వెంకటయ్య, రాము,గుంపు నరేష్,అశోక్ గౌడ్,నరేందర్, రాములు నర్సింహ, శివరాజ్, రవి, కమలాకర్,దేవేందర్, రాజు, మహేష్,కల్పన, ప్రతిభా,వీణ, కృష్ణవేణి, హేమకుమారి, రాజేశ్వరి, అనురాధ, మాధవి, నీలిమ, అనిత, శాహీన్ ఫాతిమ, సులోచన, రాధిక, వనజ, గీత తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!