ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeతెలంగాణపో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడి మృతి

పో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడి మృతి

📰 Generate e-Paper Clip

పో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడి మృతి.

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పానుగంటి పర్వతాలు డిమాండ్

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 28,పో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు పప్పు యాదవ్ మృతికి బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. నందిగామ మండల పరిధిలోని మేక గూడ గ్రామ శివారులో ఉన్న పో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో వలస కార్మికుడిగా పనిచేస్తున్న 30 ఏళ్ల పప్పు యాదవ్ ఈరోజు విధుల్లో ఉండగా ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చిందని, తనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని యాజమాన్యాన్ని వేడుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదని పర్వతాలు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు మృతి చెందే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కార్మికుడు మృతి చెందిన తర్వాత హుటాహుటిన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి నామమాత్రపు చికిత్స చేయించినట్లు నాటకం ఆడుతూ, పప్పు యాదవ్ మృతిని సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు కంపెనీ యాజమాన్యం ప్రయత్నించిందని పర్వతాలు విమర్శించారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మృతుడి కుటుంబం తరఫున కంపెనీ ఎదుట బైఠాయించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!