పాలిటెక్నిక్ విద్యను యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావద్దు

పాలిటెక్నిక్ విద్యపై ‘97’ జీవోను వెనక్కి తీసుకోవాలి
పేద విద్యార్థులపై ఫీజుల భారం పడే నిర్ణయాలను నిలిపివేయాలి
జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి కి వినతి పత్రం అందించిన ఆకాష్ నాయక్
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్18:ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి–యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్న జీఓఎంఎస్ నెం.97 నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా నాయకులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ సి. నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలను పీపీపీ విధానంలో నడిచే యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్తే పేద, మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులపై భవిష్యత్లో అధిక ఫీజుల భారం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక సాంకేతిక విద్యా వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా విద్యార్థుల ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి లేకుండా చూడాలని కోరారు.జీఓఎంఎస్ నెం.97ను.ఉపసంహరించుకోవడంతో పాటు, పాలిటెక్నిక్ విద్య స్వతంత్రతను కాపాడాలని, ఖాళీ అధ్యాపక పోస్టులు భర్తీ చేసి ఆధునిక ల్యాబ్లు, పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.



