పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి కేసీఆర్ నివాళి

రూ2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసిన కేసీఆర్
నర్సంపేట ఆగష్టు9 (నమస్తే భారత్ ) :
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను బీఆర్ ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి చేరుకున్న కేసీఆర్ సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో, పార్టీ అభివృద్ధిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పోషించిన పాత్ర స్మరణీయమని, ఆయన మృతి పార్టీతో పాటు నియోజకవర్గానికి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ నిధి నుంచి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన ఇద్దరు పిల్లల భవిష్యత్, చదువుల కోసం ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున, వృద్ధురాలైన తల్లి అమృతమ్మ సంక్షేమం కోసం రూ. 25 లక్షల చెక్ ను అందజేశారు.కేసీఆర్ రాక సందర్భంగా గులాబీ శ్రేణులు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో నల్లబెల్లికి చేరుకోవడంతో గ్రామంలో జనసంద్ర వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
*బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు దారి పొడవునా ఘన స్వాగతం* :
నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి లో కీ శే. మాజీ ఎమ్మెల్యే పెద్ధి సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి రోడ్డు మార్గాన వెళ్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుదారి పొడవునా నాయకులు, కార్యకర్తల అభివాదం చేశారు.
‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తిన కూడళ్లు హోరెత్తాయి.
కేసీఆర్ ప్రయాణిస్తున్న మార్గంలో పలు గ్రామాలు, పట్టణాల కూడళ్ల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తమ అభిమాన నాయకుడి రాక కోసం రహదారుల వెంట వేచి ఉన్నారు. పలు ప్రాంతాల్లో కేసీఆర్‌కు అభివాదం చేస్తూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ నినాదాలతో రహదారులు మార్మోగాయి. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ నర్సంపేటకు వెళ్తున్నారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకోనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరడంతో రహదారుల వెంట సందడి నెలకొంది. కాగా కేసీఆర్ నర్సంపేట పర్యటనకు సంబంధించిన సమాచారంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లో ఎదురుచూస్తూ నినాదాలు చేశారు.



