ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

📰 Generate e-Paper Clip

ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

➤ పలు కాలనీల ప్రజల నుంచి వినతిపత్రాల స్వీకరణ

➤ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, కమ్యూనిటీ హాళ్లపై ప్రధాన వినతులు

➤ అత్యవసర సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు

➤ మిగిలిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ

➤ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్న మాజీ ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని నియోజకవర్గ తొలి శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం షాపూర్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు కాలనీలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వినతిపత్రాలను మాజీ ఎమ్మెల్యేకు అందజేశారు. అలాగే పలువురు తమ కుటుంబ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అందించి, కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ప్రజలు వినిపించిన సమస్యలను కూన శ్రీశైలం గౌడ్ ఓపికగా విని, వాటి పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టగా, మిగిలిన అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేయడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా ధ్యేయం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!